Reason

దేవునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా!

మనము క్రీస్తు యందు నివసిస్తున్నామన్న విషయము తెలిసినదే. ఆయనలో మనము నిత్యజీవమును పొందాము. అనుదినము ఆయన మనకు చేస్తున్న ఉపకారముల వలన మనము ఆనందమైన జీవితమును గడుపుచున్నాము. మరణము మనలను ఏమీ చేయదను నమ్మకముతో జీవిస్తున్నాము. వీటన్నిటికి కారణము యేసు క్రీస్తు.

ఆయనలో ఇంతగా ఆనందిస్తున్న మనము ఈ నిజమైన దేవుని గురుంచి ఇతరులతో చెప్పి మన అనందమును వారితో పంచుకొనవలెను కదా! కానీ చెపితే ఏమనుకొంటారో అన్న భయముతో స్వార్ధపరులుగా ప్రవస్తిస్తున్నాము! దేవునిలో జీవించుటలో ఉన్న ఆనందాన్ని మనమే అనుభవిస్తున్నాము. అన్యులు మనమీద అంత్య తీర్పు సమయములో నేరారోపణ చేస్తారు అన్న విషయమును గుర్తించలేక పోతున్నాము. వారు మనమీద ఏమి నేరము మోపుతారంటే:

"ఓ యేసు క్రీస్తు ప్రభు! వీరు మిమ్ములను ఎరిగి మీలో బాగా ఆనందించారు గాని మాకు మీ గురించి ఏనాడూ చెప్పలేదు!" అప్పుడు షీబా దేశపు రాణి కూడా మనమీద నింద మోపుతుంది! (మత్తయి 12:42)

షీబా దేశపు రాణి మనమీద ఎందుకు నేరారోపణ చేస్తుంది?

ఎందుకంటే, ఆమె సోలోమోను జ్ఞానము గురించి విని ఆయనను చూడడానికి వెళ్ళినది. ఆమెకు సోలోమాను గురించి ఎలా తెలిసినది? ఎవరో చెప్పబట్టే కదా! ఈ సోలోమోను కంటే గొప్పవాడైన యేసు క్రీస్తు ప్రభువు గురించి మనకు తెలిసీ మనతో వున్న వారికి చెప్పకపోతే ఆమె ఊరుకొంటుందా? ఆమె అన్యుల తరపున మనమీద నేరారోపణ చేయదా? (మత్తయి 12:42)

కాబట్టి, మనము మనకు తెలిసన వారందరికీ సువార్తను తెలియ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు పూర్తి బైబులు ఇచ్చి, నా పనైపోయిందిలే అనుకొంటే సరిపోదు. మనము వారికి అర్ధమయ్యేట్లు చెప్పవలెను. అందుకు ఈ చిన్న కధ పనికి వస్తుందని భావిస్తున్నాను. దయచేసి దీనిని మీరు చదివి ఎమన్నా మార్పు చేయాలంటే నాకు చెప్పండి. ఆ తర్వాత మీ యొక్క బంధుమిత్రులకి ఈ కధ యొక్క ప్రతిని ఇవ్వండి. ఆ తర్వాత వారి అభిప్రాయమును తెలిసుకోండి.

దేవుని సువార్తను అందరితో పంచుకొనటమే మన ధ్యేయం!

ఫైత్స్కోప్.కామ్

No comments :

Post a Comment