ఒక రాకుమారుడి కధ!

ఒక రాజుకి ఒక కుమారుడు వుండే వాడు. రాజుకి తన కుమారుడు అంటే ప్రాణం. అలాగే తన ప్రజలన్న ప్రాణం. రాజు మరియు రాజ కుమారుడు ప్రజలను కన్న బిడ్డల వలే చూసుకునేవారు. అయన రాజ్యములో పాపము లేనందు వలన శాంతి సమాధానాలు ఉండేవి. కానీ శత్రు రాజ్యాల కుట్ర వలన పాపము ప్రవేశించినది. ప్రజలు పాపము  చేయడానికి అలవాటు పడ్డారు. దొంగలించుట, వ్యబిచారము, చంపుట వంటి దురలవాట్లకి అలవాటు పడ్డారు. రాజ్యములో శాంతి సమాధానము కరువయ్యాయని రాజుకి అర్ధమైనధి. పాపము చేసిన వారందరిని బంధించి వారిని శిక్షించాలని తలచారు. శిక్ష అమలు చేసే సమయానికి పాపులు రాజు కాళ్ళ మీద పడి క్షమాపణ అదిగెవరు. రాజుకి వారి పరిస్తితి చూసి జాలి మరియు బాధ కలిగేది. అయన వారిపై జాలి చూపి వాళ్ళని ఇకపై పాపము చేయవద్దని వదిలేసేవారు.

కానీ పరిస్థితి మారలేదు వారు మరల పాపము చేయడం ఆపలేదు.  ప్రజలు పాపము చేసి రాజుని క్షమాపణ అడిగేవారు, అది వారికి అలవాటైపోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్తుతుల్లో రాజు వారికి పాప క్షమాపణ ఊరికే ఇవ్వకుండా ప్రాయచిత్తనికి ఏదో ఒక శిక్షని ఇవ్వడం మొదులుపెట్టారు. అవి ఎటువంటివి అంటే:

 1. తల నీలాలు అర్పించుట.
 2. పుణ్య నదిలో స్నానాలు ఆచరించుట.
 3. గొనె సంచులు ధరించి ఉపవాసము ఉండుట.

ఈ శిక్షలతో కూడా పరిస్థితి మారలేదు వారు మరల పాపము చేయడం ఆపలేదు. అందుకు రాజు మరింత కటినమైన శిక్షని ఇవ్వడము మొదులుపెట్టారు. అది ఏమిటంటే పాపము చేసిన వాడు ప్రాయచిత్తముగ తన జీవనాధారమైన పశువును బలిగా ఇమ్మన్నారు. దీనివల్ల కొంతమంది బయపడి పాపము చేయుట మానారు. ఎందుకంటే వారికీ జీవనాధారమైన, అతి ప్రేమతో పెంచుకొన్న పశువు లేకపోతే జీవించడము కష్టము కదా!

కానీ అందరు పాపము చేయుట మానలేదు. ధనవంతుల దగ్గర చాల పశువులు వున్నవి కదా, వారికి బలి అర్పించడము సాధారణమైన విషయము అయినది.

ఇటువంటి పరిస్థితుల్లో రాజు తన మంత్రులను ప్రజల దగ్గరికి పంపి వారిచే పాపము చేయవద్దని బోధించేవాడు. కొంతమంది వారి మాటవిని మారారు. కొంత మంది వారిపై దాడి చేసి హింసించి అంతటితో ఆగక వారిని చంపేసారు. రాజుకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో అయన పాపం చేసిన వారందరిని చంపెసేవాడే కానీ మారిన కొంతమందిని చూసి మరియు తనకున్న ప్రేమని బట్టి ఆయన వారిని చంపలేదు. బయంకరమైన నేరాలు చేసిన వారికి మాత్రమే మరణ శిక్ష విధించాడు.రాజుకి ప్రజలను శిక్షించుట ఇష్టము లేదు, వారు మారాలనే తన ఆశ.

రాజు ప్రజలమీద తనకు ఉన్న ప్రేమతో చివరికి తన ప్రియమైన కుమారుడిని వారి దగ్గరకు పంపేడు. రాజ కుమారుడు తన అధికారాన్ని వదిలి ప్రజలో కలసిపోయి వారిలో ఒకడిగా జీవించాడు. వారిలో ఒకడిగా పాపం చేయకుండా జీవిస్తూ వారికి  మంచి పద్దతులు నేర్పే వాడు. ఆయనను చూసి చాలామంది మంచివారిగా మారారు. కొంతమంది అయన చేయు బోధనలో అయన సహాయకులగా మారారు. వీరితో కలసి రాజ కుమారుడు తన రాజ్యములో పర్యటిస్తూ మంచి మార్గాన్ని మరియు తన తండ్రికి  ప్రజలపై ఉన్న ప్రేమను బోధించాడు. అయన బోధనలోని ముక్యమైన విషయాలేమిటంటే:

1. పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుని  ప్రేమింప వలెను.
2. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనను.

వీటిని మీరు మనస్పూర్తిగా ఆచరించిన మీరు ఏ పాపమూ చేయరు. ఎవరైనా దేవుని మనస్పూర్తిగా ప్రేమిస్తూ మరియు తన పోరుగువానిని తనలాగా చూచుకోనేవాడు తన తల్లిని, తండ్రిని మంచిగా చూచుకోరా? దొంగలిస్తారా? వ్యభిచారిస్తారా? హత్య చేస్తారా?అబద్ద సాక్షములు పలకగలరా?

తన బోధతో అయన అందరిని పాపమునుండి విముక్తులు కమ్మని, దేవుని ప్రేమ చాలా గొప్పదని, మారు మనస్సు పొంది మంచిగా జీవించేవారి పాపములు క్షమించబడునని చెప్పారు.

కాని, అయన మంచి బోధనను తట్టుకోలేని కొందరు ఆయనను క్రురాతి క్రూరమైన మరణమునకు గురి చేసారు, ఆ మరణశయ్య మీదున్న తన కుమారుని చూసి రాజు హృదయము విలవిలలాడింది. రాజు బాధతో కోపముతో పాపత్ములంధరిని సంహరించాలనుకొన్నాడు. అయన కోపము భుమినిసైతం గడగడ లాడించింది.
 
కానీ, మరణశయ్య మీదున్న రాజ కుమారుడు రాజుతో ఈ విధముగా వేడ్కున్నాడు "తండ్రీ వీరు ఏమిచేయుచున్నారో వీరు ఎరుగరు, నన్ను చూసి వారిని క్షమించండి". ఈ మాటలు విన్న వారి హృదయాలు ధ్రవించాయి. రాజు కుమారిడి మరణానికి కారణమయిన ఒకడు ఈ విధముకు విలపించాడు "అయ్యో నేను మీకు ఇంత ద్రోహము చేసినప్పటికీ నన్ను క్షమిస్తున్నావా! నాకు పడవలసిన శిక్షను నీవు తీసుకోన్నవే! ఇంత ప్రేమ నన్ను క్రుంగ తీస్తున్నది. ఇక ఏనాటికి నేను పాపమూ చేయను!"No comments :

Post a Comment